మేలుకోవే చిట్టి తల్లి, మేలుకో నా కన్నతల్లి, మేలుకో బంగారుతల్లి, గంగాగాగా మేలుకో
అడవిలోని పొండుమల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిచి నిన్ను చూసి, ఎన్నలమ్మలా నువ్వు నవ్వవే, గంగాగాగా మేలుకో
తూరుపమ్మ పొద్దు పూవు పూసే, కొక్కోరోక్కో కోడి కూసే, గూటిలోని గువ్వ లేసి, ఆటలాడగ నన్ను పిలిచే, గంగాగాగా మేలుకో
చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలె అడుగుతుంది, నీకు లాలె పోస్తనంటు నల్ల మబ్బే నవ్వుతోంది, గంగాగాగా మేలుకో
నవ్వితే రతనాలు రాలే ముద్దుకే ముత్యాలు రాలే మొగము మోదుగు పూవులాయే, పలుకులేమో రామసిలకలాయే, గంగాగాగా మేలుకో
సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా, నూరేళ్ళు బతకమంటూ నా ఆయువు నీకు పోస్తా గంగాగాగా మేలుకో
గంగాగాగా మేలుకో
Tuesday, December 27, 2011
Thursday, January 13, 2011
Kotta bangaaru lokam -- Nee prashnalu
Kotta bangaaru lokam
Sirivennela..
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా , నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగాఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా , ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కనని కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా, అనుకుంటే అతి సుళువా
పొరబడినా పడినా, జాలి పడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగి పోదే నువ్వొచ్చేదాక ఓ ఓ ఓ ఓ ఓ ...
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది,
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది ఓ ఓ ఓ ఓ ఓ ...
సుడిలో పడు ప్రతి నావ ఓ ఓ .. చెపుతున్నది వినలేవా
పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తరువాతనే పెను చీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని , అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల-చితులు అందించాలా ప్రేమికులు ఓ ఓ ఓ ఓ ఓ ...
ఇది కాదే విధి రాత ఓ ఓ ..అనుకోదేం ఎదురీత
పది నెలలు ||1 ||
Subscribe to:
Posts (Atom)