Thursday, January 13, 2011

Kotta bangaaru lokam -- Nee prashnalu

Kotta bangaaru lokam
Sirivennela..
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఇవ్వరుగా , నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా , ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కనని కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా

బ్రతుకంటే బడి చదువా, అనుకుంటే అతి సుళువా
పొరబడినా పడినా, జాలి పడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగి పోదే నువ్వొచ్చేదాక ఓ ఓ ఓ ఓ ఓ ...

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది,
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది ఓ ఓ ఓ ఓ ఓ ...
సుడిలో పడు ప్రతి నావ ఓ ఓ .. చెపుతున్నది వినలేవా

పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా, ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తరువాతనే పెను చీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని , అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల-చితులు అందించాలా ప్రేమికులు ఓ ఓ ఓ ఓ ఓ ...
ఇది కాదే విధి రాత ఓ ఓ ..అనుకోదేం ఎదురీత

పది నెలలు ||1 ||

No comments: