గురుఃబ్రహ్మ గురుఃవిష్ణు గురుఃదేవో మహేశ్వరః
గురుఃసాక్షాత్ పరఃబ్రహ్మ తస్మైశ్రీగురవే నమః
ఓం నమో నమో నమఃశివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగాయ తరంగితోత్త మాంగతే నమఃశివాయ
ఓం నమో నమో నమఃశివాయ
శూలినే నమో నమః కపాలినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా ।2।
అమృత గానమిది పెదవులదా అమితానందపు యదసడిదా
సాగిన సాధన సార్ధకమొందగా యోగబలముగా యాగఫలముగా ।2।
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
అందెల రవమిది పదములదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై ।2।
మేను హర్ష వర్ష మేఘమై వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగి రంగులై
లాశ్యం సాగే లీల రసఝరులు జారువాలేల
జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా
నయన తేజమే నకారమై
మనోనిశ్చయం మకారమై
శ్వాస చాలనమే శికారమై
వాంఛితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారమ్
మంత్రం మకారమ్
స్త్రోత్రం సికారమ్
వేదం వకారమ్
యజ్ఞం యకారమ్
ఓం నమఃశివాయ
భావమే భౌనపు భావ్యము కాగా
భరతమే నిరతము భాగ్యము కాగా
రుహిన గిరిలు కరిగేల తాండవమాడే వేళ
ప్రాణ పంచమమే పంచక్షరిగా పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదఖింకినులై పది ధిక్కుల ధూర్జటి ఆర్భటిరేగ
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యదసడిదా
అందెల రవమిది పదములదా
Friday, July 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment